నిన్న ఏమైందని తిట్టావ్
నేడు ఏం కాలేదని ఏడ్చావ్
నిజం తెలిసినా అబద్దం అంటే ఇష్టం
కాని బాధ పడేంతకష్టం
అన్నిటికీ దేవుడున్నాడని అంటావ్
కాని ఏం చెయ్యకుండా కూర్చుని పగటి కలలు కంటావ్
మనసును గెలిస్తే ప్రపంచాన్ని గెలుస్తావ్
కానీ ప్రాపంచికంలో తగులుకుని కుళ్ళి కుళ్ళి ఛస్తావ్
No comments:
Post a Comment