Friday, January 23, 2009

Rangarinchina bhavam

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా.. ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

ఫ్రపంచం అంతా నిద్రపోతోంది.. నేను మాత్రం నీ గురించే ఆలోచిస్తున్నా... మెటీరియల్ ప్రపంచం లో బ్రతికేస్తున్నా.. అపుడపుడు నా పాత నేను బయటకు వస్తూ ఉంటాను... ఎందుకో మరి... మనిషిని అనడనికి ప్రూఫ్ ఇదే నేమొ..

అలా వెన్నెలని చూడాలని... నీ గురించి ఆలోచిస్తూ చూడాలని కోరిక..ఏమిటి చూడాలి? ఏమో తెలీదు.. మధ్యలో ఒక్కసారి అలా చల్లగాలి వీచి వెళ్తూ తడుతున్నట్టు అనిపిస్తుంది... అదే గాలి నిన్ను కూడా తడుతుందేమొ.. అమెరికా చంద్రుడికి దగ్గరగా ఉంది అని చెప్పారెవరో చిన్నపుడు... నిజమనుకున్నా.. అలా అయితే నీకు కూడ దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతాను..

ఫెల ఫెల మని ఉరుములు ఉరిమిన వేళ నువ్వే గుర్తొస్తావు.. ఇవి నా సొంతం కాదు... ఎవరో రాసినవి.. ఎవరికోసమో రాసినవి... కానీ నాకు నచ్చినవి.. నిజమే ప్రేమ లేకపొతే ఏమీ సందర్భం లేకుండా ఏదో పని చేస్తున్నపుడో ఏదో చూస్తున్నపుడో ఎందుకు గుర్తొస్తావు? అందుకే మరి...

నిజంగా నేనేనా ఇలా వింతలు చూస్తున్నా....

No comments:

Post a Comment